ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

11 కేజీల బరువు తగ్గిన హీరోయిన్ సలహాలు

ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సమీరా రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో చిరంజీవికి కూడా జోడీగా నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. తెలుగు లో ఆఫర్లు వచ్చినా కూడా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు గత పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటు వస్తుంది.

పెళ్లి మరియు పిల్లలతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు మరియు తన అభిమానులకు ఎప్పుడు చేరువగానే ఉంటుంది. సినిమాలు చేయకున్నా ఆమె ఇంతకు ముందు నటించిన సినిమాలతో మరియు సోషల్ మీడియా పోస్ట్ లు ఇంకా విమర్శలు మీమ్స్ తో సమీరా రెడ్డి రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమె ఏకంగా 11 కేజీల బరువు తగ్గిందట.

సోషల్ మీడియాలో తన బాడీ షేమింగ్స్ పై వస్తున్న విమర్శలు మరియు మీమ్స్ కారనంగా బరువు తగ్గినట్లుగా చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని.. ఏదైనా నేను చేయగలను అనే నమ్మకం నాలో పెరిగింది. కెరీర్ లోనే కాకుండా జీవితంలో కూడా ఎలాంటి సందర్బంను అయినా కూడా చాలా ఈజీగా ఎదుర్కొనగలను అంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది.

బరువు తగ్గడం కోసం ఆమె పాటించిన కొన్ని టిప్స్ ను ఆమె వెళ్లడించింది. ప్రతి ఒక్కరు కూడా బరువు తగ్గాలని బలంగా కోరుకుంటే తగ్గడం కష్టం ఏమీ కాదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు గర్బం దాల్చిన సమయంలో శరీరంలో ఏర్పడే మార్పులు మరియు డెలవరీ అయిన తర్వాత బరువు పెరిగే విషయమై ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సమీరా రెడ్డి గర్బవతిగా ఉన్న సమయంలో మరియు ఆ తర్వాత కూడా బరువు పెరిగారు. కనుక చాలా మంది ఆమె ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం జరిగింది. ఆ కారణంగానే బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి సఫలం అయ్యింది. బరువు తగ్గాలి అంటే ఏదైనా ఒక ఆటను ఎంచుకోవాలి. ఏ ఆటలో అయితే ఆసక్తి ఉంటే ఆ ఆటను ఎక్కువ ఆడటంతో పాటు ఫిజికల్ గా కష్టపడాలంటూ ఆమె చెప్పుకొచ్చింది.

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. బరువు తగ్గడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా ప్రతి రోజు కూడా వ్యాయామం చేయాలని పేర్కొంది. అమాంతం బరువు తగ్గాలని ట్రీట్మెంట్ లు తీసుకోవడం కంటే మెల్ల మెల్లగా బరువు తగ్గే విధానాలను ఫాలో అవ్వడం ఉత్తమం అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version