ఈ కేసును విచారిస్తున్న సీసీబి అధికారులు పలు కీలక విషయాలను సేకరించారు. అరెస్ట్ అయిన ఇద్దరు హీరోయిన్స్ కూడా రౌడీలు మరియు మాఫియా డాన్ లతో సంబంధాలు కొనసాగించారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రౌడీ గ్యాంగ్ లతో వీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లుగా వారి మొబైల్ డేటాను పరిశీలించగా వెళ్లడి అయ్యిందట. ఇక మాఫియా డాన్స్ తో కూడా డ్రగ్స్ విషయంలో సంబంధాలు పెట్టుకున్న వీరు బెయిల్ పై బయటకు వస్తే ఖచ్చితంగా సాక్ష్యులను తారు మారు చేస్తున్నారని భావిస్తున్నారు.
పలు భాషల్లో నటించిన సంజన 42 సినిమాలు చేసింది. కాని ఏ సినిమాకు కూడా ఆమె కోట్లకు కోట్లు పారితోషికం అందుకున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఆమె వందల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించింది అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఆమె ఆస్తుల విషయంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు గాను విచారణ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెకు ఉన్న ప్రతి ఆస్తి తాలూకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఆమెకు కేసుతో సంబంధాలను రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.