ఆ తర్వాత తెలుగులో జీనియస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇక సోషల్ మీడియాలో సానుష కొంత మందికి గట్టి కౌంటర్ ఇచ్చింది.
సానుష ఈ మధ్య కొంత బరువు పెరిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఓపిక పట్టిన ఈ మలయాళీ భామ ఇప్పుడు రెస్పాండ్ అయింది. “నా కన్నా నా బరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న అందరికీ, జీవితం అంటే సన్నగా, అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. వేరొకరి శరీరం గురించి కామెంట్ చేసేటప్పుడు గుర్తించుకోండి. రెండు వేళ్ళు వేరే వాళ్ళవైపు చూపిస్తే మూడు వేళ్ళు మీకే చూపిస్తాయి” అని కౌంటర్ ఇచ్చింది.