కబీర్ సింగ్ ఇచ్చిన ఊపుతో మరో తెలుగు సినిమా రీమేక్ కు షాహిద్ పచ్చజెండా ఊపిన విషయం తెల్సిందే. తెలుగులో నాని హీరోగా వచ్చి మంచి పేరు సంపాదించుకున్న జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ ఇప్పటికే మొదలైనా కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే షాహిద్ మరో రీమేక్ కు ఓకే చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తెలుగు సినిమా కాదు, తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కి తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్ తో విడుదల కావాల్సిన చిత్రాన్ని షాహిద్ రీమేక్ చేస్తున్నాడంటున్నారు. నిర్మాత గుణీత్ మోంగా ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.