ఎన్నికల ఏజెంట్ కాకుండా, పోటీ చేస్తున్న అభ్యర్థి కాకుండా ఎన్నికలు జరుగుతున్న చోటుకు వెళ్లే అవకాశం కేవలం మీడియా వారికి మాత్రమే ఉంటుంది. కాని వీటిలో ఏ ఒక్క క్యాటగిరీకి చెందని ఆ ఇద్దరు ఎలా పోలింగ్ బూత్ లోకి వెళ్లారంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమీషన్ కు ఇప్పటికే బీజేపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమల్ ఇద్దరు కూతుర్ల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అకాశం ఉందంటున్నారు. ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయం ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.