ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ప్రియుడి కోసం శ్రుతి పాట్లు అన్నీ ఇన్నీ కావు!

శ్రుతి హాసన్ బోయ్ ఫ్రెండ్ శంతను హజారిక గొప్ప చిత్రలేఖన కళాకారుడు అన్న సంగతి తెలిసిందే. డూడుల్ ఆర్టిస్టుగా అతడు పాపులరయ్యారు. గత కొంతకాలంగా శంతను ట్యాలెంట్ ని సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేసేందుకు శ్రుతి చేయని ప్రయత్నం లేదు. దాదాపు కోటిన్నర పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్న శ్రుతి హాసన్ షేర్ చేసే ప్రతిదీ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.

మరోవైపు శ్రుతి హాట్ హాట్ ఫోజులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా జనాన్ని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గోతిక్ ని వెస్ట్రన్ స్టైల్స్ ని శ్రుతి విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఫోటో షూట్ లో కళాత్మక పెయింటింగుల నడుమ శ్రుతి ఇచ్చిన ఫోజు ఆకట్టుకుంది.

చుట్టూ పెయింటింగులు.. వాటన్నిటి నడుమా నేలపై కూర్చొని ఒక కన్నుని కప్పుతూ కురులు ఆరబోస్తూ థై సొగసుని ఎలివేట్ చేస్తూ.. ఓర చూపుతో మైమరిపిస్తోంది. షూట్ లో భాగంగా క్యాప్చర్ అయిన ఆర్ట్ వర్క్ సూపర్బ్. శ్రుతి దుస్తుల్లో కొత్త దనం లేకపోయినా… ఆ ఫోజు మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే ఉంది. ఇక అందాల భాగ్యలక్ష్మి ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే క్రాక్ సక్సెస్ తో శ్రుతి హాసన్ టాలీవుడ్ కెరీర్ ట్రాక్ లో పడింది. వకీల్ సాబ్ తోనూ మంచి విజయం అందుకుంది.

వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టకుండా సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం మాతృభాషలో లాభమ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ లోనూ నటిస్తోంది.

Exit mobile version