ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వీడియో : వర్కౌట్స్ లో ఫన్.. నాన్నను చూసి అదే నేర్చుకున్నా

సినిమాలతో కాస్త అటు ఇటుగా ఆలస్యంగా వచ్చినా కూడా సోషల్ మీడియా పోస్ట్ లతో రెగ్యులర్ గా శృతి హాసన్ అభిమానులను పలకరిస్తూనే ఉంది. తాజాగా వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చాలా సరదాగా వర్కౌట్స్ చేస్తు కనిపించింది. ఇర్ఫానిక్ ఖాన్ తో కలిసి శృతి హాసన్ చేసిన వర్కౌట్స్ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు కూడా అలసి పోకుండా చాలా సీరియస్ వర్కౌట్స్ ను ఫన్ గా చేశారు. ఎంత కష్టపడ్డా కూడా ఫన్ ఉంటే ఖచ్చితంగా అది మరింత ప్రయోజనం ను చేకూర్చుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే శృతి హాసన్ ఇలా సన్నిహితుడితో కలిసి వర్కౌట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారిక వీడియోకు చాలా సీరియస్ గా చేస్తున్నారు. మీ ఫిట్ నెస్ మరియు హ్యాపీ నెస్ కు ఇదే కారణం అయ్యి ఉంటుందేమో అంటూ కామెంట్ పెట్టాడు.

తాజాగా ట్విట్టర్ లో శృతి హాసన్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. వాట్సప్.. ఇన్ స్టా మరియు ఫేస్ బుక్ లు ఓపెన్ కాని సమయంలో శృతి హాసన్ ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా తండ్రి నుండి ఏమి నేర్చుకున్నారు అంటూ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రి నుండి జీవితాన్ని ఆస్వాదించడం.. నిజాయితీగా ఉండటం వల్ల ఆనందంగా ఉండటంను నేర్చుకున్నాను అంది. డబ్బు మరియు ఇతర విషయాల కంటే నిజాయితీగా ఉండటం అనేది ఎక్కువ ఆనందంను కలిగిస్తుంది అంటూ తాను నమ్మే జీవిత సత్యంను శృతి హాసన్ చెప్పింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

సలార్ లో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న శృతి హాసన్ ఆ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మరింతమందికి చేరువ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు తమిళం మరియు హిందీల్లో కూడా నటించిన ఈ అమ్మడు ముందు ముందు ఉత్తరాదిన మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా సౌత్ లో సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. కరోనా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్లీ మ్యూజిక్ పై శ్రద్ద పెట్టబోతున్నట్లుగా చెప్పింది. లండన్ లో ప్రదర్శణకు గాను కొత్త వారిని ఎంపిక చేసేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా ఆమె చెప్పింది. మొత్తానికి శృతి హాసన్ తాను చేస్తున్న పనిపట్ల చాలా సంతృప్తిగా ఉండటంతో పాటు ఆనందంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

Exit mobile version