Advertisement

తమన్నా, శృతి హాసన్.. అటూ ఇటూ

Posted : November 12, 2021 at 3:37 pm IST by ManaTeluguMovies

ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా వెలిగిన తమన్నా, శృతి హాసన్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్యా మంచి సఖ్యత ఉంది. ఇరువురూ కూడా బయట ఫంక్షన్స్ లో చాలా క్లోజ్ గా మెలుగుతూ ఉంటారు. ఇద్దరూ కూడా ఎవరి రీతిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు స్నేహితురాళ్ళు ఇప్పుడు ఒకరు చేయాల్సిన మూవీ మరొకరు చేయడం ఇండస్ట్రీలో వైరల్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయనున్న భోళా శంకర్ సినిమాకు మొదట శృతి హాసన్ ను తీసుకున్నారు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో శృతి హాసన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు.

అలాగే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారు కానీ రెమ్యునరేషన్ సమస్య రావడంతో తమన్నా స్థానంలో శృతి హాసన్ ను తీసుకున్నారు.


Advertisement

Recent Random Post:

The Indian Story Trailer | Raaj Bheemreddy | R Rajashekar Reddy | Sandeep Kanugula

Posted : April 25, 2024 at 2:12 pm IST by ManaTeluguMovies

The Indian Story Trailer | Raaj Bheemreddy | R Rajashekar Reddy | Sandeep Kanugula

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement