ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ లో నటిస్తోంది. శ్రుతి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా కేటగిరీ చిత్రం కావడం విశేషం. సినిమా రిలీజ్ అయి హిట్ అయితే అమ్మడి క్రేజ్ అంతకంకు పెరిగపోవడం పక్కా అని తెలుస్తోంది. అమ్మడి ప్లానింగ్ చూస్తే మరింత ప్రోఫెషినాల్టీ కనిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రుతినే హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ కి కూడా శ్రుతి హాసన్ నే లాక్ చేసినట్లు గుస గుస వినిపిస్తోంది. ఇలా శ్రుతి కెరీర్ సంతోషంగానే సాగిపోతుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి యాక్టివిటీ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంది. ప్రియుడితో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. అభిమానులతో ఆసక్తికర చర్చకు సిద్దమవుతుంటుంది. తాజాగా ఇన్ స్టాలో అమ్మడు అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఏకంగా మీ సైజ్ ఎంత అని అడిగాడు. అంటే అతని ఉద్వేశం మీ లిప్ సైజ్ ఎంత అని అడిగాడు.
అంటే ఏంటి? లిప్ కి కూడా సైజ్ ఉంటుందా? అని శ్రుతి హాసన్ నోరెళ్లబెట్టింది. మొదట సైజ్ అంటే కాస్త కంగారు పడినా వెంటనే అభిమాని లిప్ సైజ్ అనేసరికి కూల్ వాతావరణం కనిపించింది. అనంతరం శ్రుతి హాసన్ అక్కడ నుంచి లేచివెళ్లిపోయింది.
ఇంకా అక్కడే కూర్చుంటే ఇంకెన్ని రకాల సైజ్ ల గురించి అడుగుతారో! ఏమోనని కామ్ గా లెప్ట్ అయింది. సోషల్ మీడియా ద్వారా హీరోయిన్లు ఇంటరాక్ట్ అవుతుంటే నెటి జనులు ప్రశ్నలు గమ్మత్తుగానే ఉంటాయి. రొటీన్ కి భిన్నంగా సెషన్ సాగుతుంటుంది. హీరోయిన్లకి ఇది ఓ రకమైన ప్రచారమే కదా.