పోకిరి, రభస, డిక్టేటర్ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా పని చేశారు శ్యామ్ కే నాయుడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పేరున్న టెక్నీషియన్ అయ్యారు. తనను పెళ్లి చేసుకునే విషయంలో శ్యామ్ ప్రామిస్ చేశాడని, తనను అతడు ఎక్స్ ప్లోయిట్ చేశాడని సదరు జూనియర్ ఆర్టిస్టు ఆరోపిస్తూ ఉంది. కొంతకాలం తాము కలిసి ఉన్నాకా, ఇప్పుడు అతడు మోసం చేశాడని ఆమె అంటోంది.
ఈ విషయంలో శ్యామ్ కే నాయుడును పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అతడిని పిలించుకున్నారట పోలీసులు. విచారిస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. వారిద్దరూ పోలీసులకు అందుబాటులోకి వచ్చారట. ఇద్దరినీ కలిపి మాట్లాడుతూ ఉన్నట్టుగా, వారిద్దరూ సెటిల్ మెంట్ కు రాని పక్షంలో ఈ వ్యవహారంపై ఐపీసీ సెక్షన్ 493 ప్రకారం శ్యామ్ కే నాయుడుపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు