ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాని శ్యామ్ సింగ రాయ్ కు విలన్ దొరికేసాడు

న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసి ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్కతాలో శరవేగంగా జరుగుతోంది. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

శ్యామ్ సింగ రాయ్ లో నాని బెంగాలీ యువకుడిగా కనిపిస్తాడు. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బెంగాలీ విలన్ ను కన్ఫర్మ్ చేసారు. అశ్వథామ, భీష్మ చిత్రాల్లో విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో విలన్ గా ఎంపికయ్యాడు.

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ ఆచార్యలో కూడా జిషు విలన్ గా నటిస్తుండడం విశేషం. ఇక రాహుల్ సంకిట్ర్యాన్ శ్యామ్ సింగ రాయ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version