అయితే సినిమాపై పచ్చి, ప్రేమ, గౌరవంతో సపోర్టింగ్ క్యారెక్టర్‌గా నటించేందుకు సిమ్రాన్ సై అంటున్నారు. తాజాగా ఆమె తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించనున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించనున్నాడు. రాజ్ తరుణ్ తల్లిగా నటించేందుకు సిమ్రాన్ ‘ఓకే’ చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సిమ్రాన్ ఇంటికే పరిమితమయ్యారు. కొడుకుతో కలిసి ఆమె డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. సిమ్రాన్ తన చిన్నప్పటి స్నేహితుడు దీపక్‌ను 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి పేర్లు అదీప్ బగ్గా, అదిత్ బగ్గా. పెళ్లయ్యాక కోలివుడ్ సినిమాల్లో సహాయక పాత్రల్లో సిమ్రాన్ నటించారు. కాగా రియల్ లైఫ్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సిమ్రాన్…రీల్ లైఫ్‌లో మరోసారి తల్లి కావడానికి సిద్ధమయ్యారన్న మాట.