రామ్ వీరపనేని ఆస్తులను చూసి ఆమె పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యిందనే వాదన వస్తుంది. తాజాగా ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో సునీత స్పందించింది. తాను రామ్ ఆస్తుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అసలు ఇప్పటికి కూడా రామ్ ఆస్తుల విషయం నాకు తెలియదు. రామ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. అతడి వ్యాపారాలకు సంబంధించిన టర్నోవర్ ఎంత అనే విషయాలను నేను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.