Advertisement

విజయేంద్ర ప్రసాద్‌ ‘సీత’ అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌

Posted : March 2, 2021 at 12:11 pm IST by ManaTeluguMovies

తెలుగు మరియు హిందీల్లో వచ్చిన ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలకు కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్ కు కథ అందిస్తున్నాడు. ఈయన మరో వైపు “సీత : ది ఇంకార్నేషన్‌ ” అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. కథ మరియు కథనం ను సీత కోసం విజయేంద్ర ప్రసాద్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడిగా అలౌకిక్ దేశాయ్ పని చేయబోతున్నారు. పూర్తి స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సినిమా గా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు.

సీత పాత్రను గతంలో ఏ సినిమాలో చూపించని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సీత పాత్ర తో విజయేంద్ర ప్రసాద్‌ అల్లిన కథ అద్బుతంగా వచ్చిందని సినిమా పనులు మొదలు పెట్టేందుకు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా నటీ నటుల వివరాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఆ విషయమై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Pawan Kalyan , Chiranjeevi పై Posani Krishna Murali ఫైర్ | AP Elections 2024

Posted : April 23, 2024 at 11:36 am IST by ManaTeluguMovies

Pawan Kalyan , Chiranjeevi పై Posani Krishna Murali ఫైర్ | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement