Advertisement

బాలయ్య హీరోయిన్ దాతృత్వం

Posted : May 23, 2021 at 6:22 pm IST by ManaTeluguMovies

హీరోలు.. హీరోయిన్స్ రీల్ పై మాత్రమే గొప్పగా కనిపిస్తారు… వారి దాతృత్వం సినిమాల వరకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కాని ఈమద్య కాలంలో కరోనా మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో తమ దాతృత్వంను చాటుకుంటున్నారు. హీరోలు హీరోయిన్స్ కాకుండా ఇతర టెక్నీషియన్స్ నటీ నటులు కూడా తమవంతు సాయంను పేదలకు అందిస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. తమకు ఉన్నదాంట్లో కొంత అయినా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని కొందరు తీర్చుతున్నారు.

బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్స్ ప్రస్తుతం ముంబయిలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఒక హీరోయిన్ కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు అవుతుండటంతో జీవనోపాది కోల్పోయిన పేదలకు ఆహారం మరియు నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ను పంపిణీ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా తనవంతు సాయంను చేసి తన మంచి మనసును చాటుకుంది.

ఇటీవల సంభవించిన తౌక్తే తుఫాన్ వల్ల నిరాశ్రయులు అయ్యి ఉపాది కోల్పోయిన వారికి సోనాల్ చౌహాన్ సాయంగా నిలిచింది. ముంబయిలోని జూహూ సమీపంలో ఉన్న శనిదేవ్ గుడి ప్రాంగణంలో ఉంటున్న నిరుపేదలకు ఆహారంను అందించింది. స్వయంగా ఆమె వెళ్లి పలువురికి ఆహారంను అందించడంతో పాటు వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంది. సోనాల్ మంచితనంను స్థానికులు ప్రశంసించారు.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Posted : April 20, 2024 at 11:39 am IST by ManaTeluguMovies

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement