మోనాల్‌పై లెక్కలేనన్ని అభాండాలు
అఖిల్‌కు తొందరగా పడుకునే అలవాటు ఉండేది. దీంతో రోజంతా అఖిల్‌తో మాట్లాడినా, రాత్రి అభిజిత్‌తో కబుర్లు చెప్పేది. కానీ ఇది జనాలకే కాదు, తోటి కంటెస్టెంట్లకు కూడా వేరేలా అర్థమైంది. ఇక గుజరాతీ అమ్మాయి కావడంతో వచ్చీరాని తెలుగుతో పాటు హిందీలో ఎక్కువగా మాట్లాడేది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దూరమైంది. ఇంకా అబద్ధాల కోరు అని, కెమెరాల ముందు నటిస్తోందని ఇలా ఎన్నో అభాండాలు ఉండనే ఉన్నాయి. లేని పోని నిందలు వేస్తూ మోనాల్‌ను దారుణంగా అవమానించడాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మోనాల్‌ను కాపాడమని సోనూసూద్‌ను వేడుకుంటున్నారు.