తాజాగా సోను సూద్ సాయం తోటి ఆర్టిస్ట్ కి పునర్జన్మని ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే, హైదరాబాద్ లో నివాసం ఉంటూ, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసే శ్రీనివాస్ కి హార్ట్ అటాక్ రావడంతో డాక్టర్ ని సంప్రదించారు. ఇమ్మీడియట్ గా ట్రీట్ మెంట్ చేయాలనీ లేకపోతే ప్రాణాపాయమని, ఆ ట్రీట్ మెంట్ కి 3 లక్షలు అవుతుందని తెలుపగా, అంత డబ్బు లేక డీలా పడిన శ్రీనివాస్ గురించి, తెలిసిన వారు సోను సూద్ కి తెలియజేశారు. వెంటనే స్పందించిన సోను సూద్ శ్రీనివాస్ ని వెంటనే అపోలో హాస్పిటల్ లో చేర్పించి ఆపరేషన్ చేయించారు.
చికిత్స తర్వాత మళ్ళీ మామూలైన ఆర్టిస్ట్ శ్రీనివాస్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదంతా సోను సూద్ పునర్జన్మ ఇవ్వడం వలనే తాను మళ్ళీ మామూలు మనిషి అయ్యానని శ్రీనివాస్ అండ్ కుటుంబ సభ్యులు సోను సూద్ కి వారి కృతఙ్ఞతలు తెలిపారు.