Advertisement

సోనూసూద్‌ ను కొట్టాడని టీవీని బద్దలు కొట్టిన బుడతడు

Posted : July 14, 2021 at 2:07 pm IST by ManaTeluguMovies

రియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సోనూ సూద్‌ గత ఏడాదిన్నర కాలంగా ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన వందల కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడటంతో పాటు ఎంతో మందికి సాయం చేసి దేవుడిగా మారాడు. దాంతో సోనూ సూద్‌ అంటే చాలా మందికి ఇష్టం ఏర్పడింది. ఆయన్ను ఒక దేవుడిగా జనాలు చూస్తూ ఉన్నారు. అలాంటి సోనూసూద్‌ ను ఒక సినిమాలో హీరో కొడుతూ ఉన్నాడంటూ ఆ సినిమా వస్తున్న టీవీని బద్దలు కొట్టాడు ఏడు సంవత్సరాల బుడతడు.

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్‌ మండలం వేపల సింగారంకు చెందిన గురవయ్య పుష్పలతల తనయుడు టీవీలో సినిమా చూస్తున్న సమయంలో హీరో సోనూసూద్‌ ను కొడుతున్నాడు అంటూ తట్టుకోలేక టీవీని చేతికి అందిన వస్తువును విసిరాడు. దాంతో టీవీ ముక్కలు అయ్యింది. షాక్ అయిన వారు ఆ కుర్రాడిని ప్రశ్నించగా సినిమాలో సోనూసూద్‌ ను కొడుతున్నారు అందుకే నేను టీవీని పగులకొట్టాను అన్నాడు. సోనూసూద్‌ ఎంతగా జనాల్లోకి చొచ్చుకు వెళ్లాడు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో సోనూసూద్ షేర్‌ చేశాడు.


Advertisement

Recent Random Post:

Vimalamma Fires On YS Sharmila, Sunitha | CM YS Jagan |

Posted : April 13, 2024 at 12:27 pm IST by ManaTeluguMovies

Vimalamma Fires On YS Sharmila, Sunitha | CM YS Jagan |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement