Advertisement

వీడియో : కష్టపడుతూ కన్నీరు పెట్టుకున్న సోనూసూద్‌

Posted : August 12, 2021 at 11:38 am IST by ManaTeluguMovies

రియల్‌ హీరో సోనూసూద్‌ సోషల్‌ మీడియాలో తాజాగా ఒక వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో సోనూసూద్‌ ఒక పాట చిత్రీకరణకు చాలా కష్టపడాలి. అది ఇప్పుడు సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది అన్నట్లుగా వీడియోను వదిలాడు. ఆ వీడియోలో సోనూసూద్ కన్నీరు పెట్టుకున్నట్లుగా సరదాగా ఫన్‌ క్రియేట్‌ చేశాడు. సరదాగా కెమెరా ట్రాలీ పై హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎక్కించుకుని ఆయన ఆ ట్రాలీని తోస్తూ సరదాగా వీడియో చేశాడు.

1990 ల్లో వచ్చిన తుమ్ తో ఠహ్రే పరదేశీ అనే సూపర్‌ హిట్ సాంగ్‌ ను రీ క్రియేట్ చేస్తూ సోనూసూద్ మరియు నిధి అగర్వాల్ పై దర్శకురాలు ఫరాఖాన్ తెరకెక్కించిన ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌ లో మంచి స్పందన దక్కించుకుంది. తక్కువ సమయంలోనే మంచి ఆధరణ దక్కించుకున్న ఈ పాట తో సోనూసూద్ మరింతగా పాపులర్ అయ్యాడు. నిధి అగర్వాల్‌ మరియు సోనూసూద్‌ లు పాటలో చక్కని ప్రతిభ కనబర్చారు. మొత్తానికి ఈ పాట సక్సెస్‌ అయ్యింది అంటూ సోనూసూద్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేశాడు.


Advertisement

Recent Random Post:

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు | Dorababu Pendem | YCP

Posted : March 21, 2024 at 5:44 pm IST by ManaTeluguMovies

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు | Dorababu Pendem | YCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement