Advertisement

సౌందర్య బయోపిక్ కు ఆ నటి సెట్ అవుతుందా?

Posted : October 12, 2020 at 12:40 pm IST by ManaTeluguMovies

ఇదంతా బయోపిక్ ల కాలం. భాషలతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. అందులో చాలా మటుకు హిట్ అయ్యాయి కూడా. అందుకే మరిన్ని బయోపిక్ లు రానున్నాయి. జీవితంలో విజయవంతమైన సెలబ్రిటీల కథలకు మసాలా జోడించి అందిస్తున్నారు దర్శక నిర్మాతలు.

తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ మహానటి ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. తమిళంలో ఇప్పుడు జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది. ఇప్పటికే ఎమ్మెస్ ధోని, మిల్కా సింగ్, నరేంద్ర మోదీ అంటూ చాలా బయోపిక్ లు తెరకెక్కాయి. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి సుధీర్ బాబు సిద్ధంగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఒకప్పటి టాప్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ సెట్ అవ్వనుంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సౌందర్య బయోపిక్ లో నటించడానికి సాయి పల్లవిని హీరోయిన్ రోల్ కోసం అనుకుంటున్నారని సమాచారం. సహజ నటిగా పేరు సంపాదించుకున్న సౌందర్య సౌత్ ఇండియా అనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి విజయాలు దక్కించుకుంది. ఎన్నో మంచి పాత్రలు చేసింది. ఆమె జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. మరి ఇంతటి వెయిట్ ఉన్న పాత్రను సాయి పల్లవి మేనేజ్ చేయగలదా అన్నది చూడాలి.


Advertisement

Recent Random Post:

Raghu Babu : సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS లీడర్ మృతి

Posted : April 18, 2024 at 3:10 pm IST by ManaTeluguMovies

Raghu Babu : సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని BRS లీడర్ మృతి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement