ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆర్జీవీకి వ్యతిరేకంగా ఆ సినిమాలో ఎలా నటిస్తా.. చేయను: శ్రీరెడ్డి

తన మార్క్ సినిమాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మ పనిలోపనిగా పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రాజెక్ట్ తీస్తున్నాడు. పవన్ కల్యాణ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ బేస్ చేసుకుని సెటైరికల్ గా ‘పవర్ స్టార్’ అనే సినిమా తీస్తున్నాడు. రోజుకో పిక్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు. సాంగ్ రిలీజ్ చేసి వారి కోపానికి కారణమయ్యాడు కూడా. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవీపై ‘పరాన్నజీవి’ పేరుతో కౌంటర్ గా సినిమా తీసేశారు. అతి తక్కువ టైమ్ లో ఈ సినిమా తీసి వర్మను తిడుతూ పాట కూడా రీలీజ్ చేశారు.

చెప్పాలంటే సినిమా తీస్తూ వర్మకే షాక్ ఇచ్చారు. దీంతో ఆర్జీవీ వర్సెస్ పవన్ గా మారిపోయింది ఇప్పుడు టాలీవుద్ లో పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ రౌండ్ అవుతోంది. పరాన్నజీవిలో ఓ ముఖ్య పాత్ర కోసం నటి శ్రీరెడ్డిని సంప్రదించారనేది ఆ వార్త. దీనిపై శ్రీరెడ్డి స్పందించింది. ‘ఇటివల ఓ సినిమాలో నటించేందుకు సంప్రదించారు. నిజమే. కానీ.. నాకు ఆర్జీవీ అంటే ఇష్టం. అందుకే పరాన్నజీవిలో ఆయనకు వ్యతిరేకంగా నటించడం లేదు. నా ఎథిక్స్ నాకు ఉన్నాయి. పవర్ స్టార్ పాట బాగుంది. ఆర్జీవీ బాగా తీశారు’ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. మరి రాబోయే రోజుల్లో ఆర్జీవీ – పవన్ ఫ్యాన్స్ మధ్య మరెన్నీ వివాదాలు జరుగుతాయో చూడాలి.

Exit mobile version