Advertisement

శ్రీకాంత్ కి విలన్ గా బ్రేకొస్తుందా

Posted : November 15, 2021 at 6:25 pm IST by ManaTeluguMovies

కెరీర్ ఆరంభించిందే విలన్ వేషాలతో. ఆ తర్వాత అనూహ్యంగా ఫ్యామిలీ హీరో అయిపోయాడు. శతాధిక చిత్రాల కథానాయకుడిగా టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సాగించాడు. అందరిలానే కెరీర్ ఆద్యంతం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా అన్నిటినీ తట్టుకుని నిలదొక్కుకున్న హీరోగా శ్రీకాంత్ కి గుర్తింపు ఉంది.

ఇక చిరంజీవి సొంత తమ్ముడిలా శ్రీకాంత్ కి మెగా కాంపౌండ్ తో ఎంతో గొప్ప రిలేషన్ ఉంది. చిరుతో కలిసి శంకర్ దాదా సిరీస్ లోనూ నటించాడు. ఇకపోతే ఇటీవలి కాలంలో శ్రీకాంత్ కెరీర్ ఆశించినంతగా సాగలేదు. అదే క్రమంలో సినిమాలు తగ్గిపోయాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే కృష్ణార్జున యుద్ధం చిత్రంలో విలన్ గా నటించాడు శ్రీకాంత్. కానీ ఆ సినిమా సరైన బ్రేక్ నివ్వలేదు. ఇప్పుడు మరోసారి విలన్ గా లక్ చెక్ చేసుకోబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండలో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నారు. ఇందులో శ్రీకాంత్ రగ్గ్ డ్ లుక్ లో కనిపించడమే కాదు.. అతడి డైలాగ్ పవర్ కానీ.. ఆహార్యం కానీ చూస్తుంటే సీరియస్ విలన్ గా అదరగొట్టడం ఖాయం అని అనిపిస్తోంది.

ఎన్.బి.కే తో నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ శ్రీకాంత్ నటించారని టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ లో అతడి లుక్ కి నటనకు రికగ్నిషన్ ఉంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఫేట్ మారుతుందనే భావిస్తున్నారు. జగపతిబాబు తరహాలోనే అతడికి బోయపాటి కలిసొస్తాడా లేదా? అన్నది చూడాలి.

ఇంతకుముందు లెజెండ్ చిత్రంతో విలన్ గా పరిచయమైన జగపతిబాబు జాతకం అమాంతం మారిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా నటించాడు. మంచి పేరు తెచ్చుకోవడమే గాక హీరోగా నటించినప్పటి కంటే ఇప్పుడు ఇంకా బాగానే ఆర్జిస్తున్నాడని టాక్ వచ్చింది. శ్రీకాంత్ కి ఆ రేంజు దక్కితే ..అంతా బోయపాటి మహిమ అనుకోవాలి.


Advertisement

Recent Random Post:

Vidadala Rajini Files Nomination With Huge Rally in Guntur

Posted : April 20, 2024 at 7:47 pm IST by ManaTeluguMovies

Vidadala Rajini Files Nomination With Huge Rally in Guntur

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement