ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విష్ణుప్రియ సీక్రెట్‌ రివీల్‌ చేసిన శ్రీముఖి

తెలుగు బుల్లి తెరపై ఈమద్య కాలంలో తెగ సందడి చేస్తున్న లేడీ యాంకర్స్‌ శ్రీముఖి మరియు విష్ణు ప్రియలు మంచి స్నేహితులు. వీరిద్దరు లాక్‌ డౌన్‌ టైంలో కూడా తెగ ఎంటర్‌టైన్‌ చేశారు. లాక్‌ డౌన్‌ సఢలించిన వెంటనే ఇద్దరు కలిసి డాన్స్‌ లు చేసిన వీడియోలు ఆ తర్వాత ఇద్దరు చేసిన ఫన్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయ్యింది. అంతుకు ముందు కూడా బిగ్‌బాస్‌ నుండి శ్రీముఖి వచ్చిన తర్వాత మాల్దీవులకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇలా ఇద్దరి మద్య మంచి స్నేహం ఉంది. తాజాగా వీరిద్దరు ఝాన్సీ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

వీరిద్దరికి కూడా ఝాన్సీ కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ముఖ్యంగా వ్యక్తిగతంగా ఒక సీక్రెట్‌ ను ఒకరిది ఒకరు చెప్పాలంటూ ఝాన్సీ కోరిన సమయంలో శ్రీముఖి ఒక ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. విష్ణు ప్రియకు అఖిల్‌ అక్కినేని అంటే విపరీతమైన అభిమానం. అభిమానం అనే కంటే అతడు అంటే ప్రాణం. ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని ఆమె కోరిక. దేవుడు ప్రత్యక్ష్యం అయ్యి ఏం కావాలని అడిగితే అఖిల్‌ ను పెళ్లి చేసుకునే వరం ఇవ్వమని విష్ణు ప్రియ కోరుతుందని శ్రీముఖి చెప్పింది.

విష్ణు ప్రియ కూడా ఆ విషయానికి సిగ్గు పడుతు ఔను అని చెప్పింది. విష్ణు ప్రియ చేతిపై అఖిల్‌ పేరు టాటూ కూడా ఉంది. అంతగా ఆమె తన మనసులో అఖిల్‌ ను పెట్టుకుంది. ఈ విషయమై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. నీ స్థాయికి అఖిల్‌ ఏంటో అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెను సమర్ధిస్తున్నారు. ఇంత మంచి అభిమాని, ఇంతటి గొప్ప అభిమాని ఉండటం నిజంగా అఖిల్‌ అదృష్టం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Exit mobile version