Advertisement

శ్రీముఖి సినిమాలెందుకు చేయట్లేదంటే..?

Posted : April 10, 2020 at 3:54 pm IST by ManaTeluguMovies

ఇంతకుముందు టీవీ యాంకర్లంటే ఒక చిన్నచూపుండేది. వాళ్లకు సినిమాల్లో అంతగా అవకాశాలు దక్కేవి కావు. ఒకవేళ సినిమాలు చేసినా చిన్నా చితకా పాత్రలే ఇచ్చేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో మొత్తం సీన్ మారిపోయింది. అనసూయ, రష్మి లాంటి యాంకర్లు బుల్లితెరపై సూపర్ సెక్సీగా కనిపించి పెద్ద ఎత్తునే అభిమానుల్ని సంపాదించుకున్నారు.

వాళ్ల గ్లామర్ ఫిలిం మేకర్లను కూడా ఆకర్షించి సినిమాల్లో ఛాన్సులిచ్చారు. రష్మి అయితే కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి నటించింది. అనసూయ సైతం కొంచెం సెక్సీగానే కనిపించే ప్రయత్నం చేసింది. ఐతే బుల్లితెరపై వీళ్లకు దీటుగా పాపులారిటీ సంపాదించిన శ్రీముఖి మాత్రం సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. చిన్నా చితకా పాత్రలు కొన్ని చేసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానుకుంది. ఐతే తనకు అవకాశాలు రాకేం కాదని.. ఐతే తనను హద్దులు దాటి నటించమని దర్శకులు చెప్పినందుకే సినిమాలు చేయట్లేదని ఆమె చెప్పింది.

ఓ టీవీ కార్యక్రమంలో శ్రీముఖి మాట్లాడుతూ.. జులాయి సినిమా చేస్తుండగా, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కావాలి అని తన తండ్రి ఆర్డరేసినట్లు శ్రీముఖి వెల్లడించింది. ఆయనకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ఆమె చెప్పింది. ఐతే జులాయి టైంలో త్రివిక్రమ్ కేవలం టీవీ షోలే చేసుకుంటూ ఉంటే పెద్దగా అవకాశాలు రావని.. సినిమాల్లో సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడని.. ఆ ప్రకారమే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించానని శ్రీముఖి చెప్పింది.

ఐతే తనకు గ్లామర్ క్యారెక్టర్లు ఆఫర్ చేసిన దర్శకులు ఎక్స్‌పోజింగ్ చేయమని, లిప్ లాక్‌లు చేయమని చెప్పడంతో అవి ఇష్టం లేక తాను సినిమాలు మానుకున్నానని శ్రీముఖి చెప్పింది. సినిమాల్లో నటించకపోయినా.. టీవీ రంగంలో తనకున్న పాపులారిటీ, వస్తున్న అవకాశాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు శ్రీముఖి చెప్పుకొచ్చింది.


Advertisement

Recent Random Post:

అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ నా కొడుకు లేడు.. | Satish Mother | CM Jagan Case

Posted : April 16, 2024 at 5:54 pm IST by ManaTeluguMovies

అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ నా కొడుకు లేడు.. | Satish Mother | CM Jagan Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement