ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టీఆర్‌ఎస్ భవన్‌లో గన్ తో హల్‌ చల్‌

టీఆర్‌ఎస్ భవన్ కు గన్‌ లు కొత్తేం కాదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్ లు ఎప్పుడు టీఆర్‌ఎస్ భవన్ లో ఉంటారు. కాని టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు తన వ్యక్తిగత గన్ తో హల్ చల్‌ చేసిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ రెండు చోట్ల విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు టీఆర్‌ఎస్ భవన్‌ లో సందడి చేశారు. బాణాసంచా కాల్చుతూ పాటలు పెట్టుకుని డాన్స్ లు వేశారు.

ఆ సమయంలోనే టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ నాయుకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గన్ తో హడావుడి చేశాడు. గన్ ను జేబులో నుండి బయటకు తీసి కాల్చేందుకు ప్రయత్నించగా పక్కనున్న వారు అతడిని వారించారు. దాంతో శ్రీనివాస్ యాదవ్‌ గన్ ను లోపల పెట్టేశాడు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పబ్లిక్ ప్లేస్ లో గన్‌ తీసినందుకు గాను శ్రీనివాస్ యాదవ్‌ పై కేసు పెట్టాల్సిందే అంటూ బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version