Advertisement

హీరోగా 26 ఏళ్లు కంప్లీట్ .. భార్యకి థ్యాంక్స్ చెప్పిన సుదీప్!

Posted : February 1, 2022 at 12:15 pm IST by ManaTeluguMovies

లైఫ్ లో ఎవరైనా సక్సెస్ ను సాధించారంటే వాళ్లు ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్లారని అర్థం. తమకి ఇష్టమైన రంగంలో అనేక కష్టనష్టాలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ముందుకు సాగారని అర్థం. కృష్టి .. పట్టుదలతో కసిగా అడుగులు ముందుకు వేసేవారు అవమానాలను అభివృద్ధికి మెట్లుగా మార్చుకుంటారు. తమని తాము మార్చుకుంటూ .. మలచుకుంటూ కాలంతో పాటు పరిగెత్తినవారే విజేతగా నిలుస్తారు. అలా తమ కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించిన కథానాయకులలో సుదీప్ ఒకరు .. కన్నడ స్టార్ హీరోల్లో ఆయన ఒకరు.

కన్నడలో సుదీప్ తన కెరియర్ ను మొదలుపెట్టేనాటికి అక్కడ స్టార్ హీరోలు రంగంలో ఉన్నారు. భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల హృదయాలను పరిపాలిస్తున్నారు. అప్పటికే మహామహులు అనిపించుకున్న ఆ హీరోలను కాదని ప్రేక్షకుల దృష్టి తన వైపు తిప్పుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదనే సంగతి సుదీప్ కి తెలుసు. అయినా ఆయన తనదైన స్టైల్ తో తెరపైకి వెళ్లాడు. సుదీప్ యాక్టింగ్ లోనే సహజమైన స్టైల్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. డైలాగ్ చెప్పే తీరు డిఫరెంట్ గా ఉంటాయి.

ఆయనలోని ఆ ప్రత్యేకత అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. అంతే హీరోగా ఆయనను వాళ్లు అంగీకరించారు. ఆయన అభిమానులుగా మారిపోతూ ప్రోత్సహించారు. హీరోయిజం .. విలనిజం .. ఈ రెండూ పండించడానికి ఆయన స్టైల్ ఎంతో ఉపయోగపడింది. ఇక అక్కడి స్టార్ హీరోలతో పోటీపడుతూ ఆయన ప్రయాణం సాగింది. ఇప్పుడు కన్నడ స్టార్ హీరోల్లో ఆయన ఒకరుగా ఎదిగిపోయారు. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను నటించి మెప్పించారు. అలా హీరోగా ఆయన 26 ఏళ్లను పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన శ్రీమతి ప్రియా సుదీప్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు అందజేశారు. ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ తమకి ఎంతో సంతృప్తిని ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇకపై కూడా ఆయన అదే హార్డ్ వర్క్ తో .. అంకితభావంతో ముందుకు వెళ్లాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు సుదీప్ స్పందిస్తూ .. ప్రతి అడుగులో ఆమె తనకి తోడు నీడగా నిలవడం వల్లనే ఈ ప్రయాణం ఇక్కడి వరకూ కొనసాగిందని చెబుతూ కృతజ్ఞతలు తెలియజేశాడు. సుదీప్ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘విక్రాంత్ రోణ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement

Recent Random Post:

Undi TDP Politics : పీక్ స్టేజ్కి చేరిన టీడీపీ ఉండి పాలిటిక్స్ రచ్చ

Posted : April 11, 2024 at 11:55 am IST by ManaTeluguMovies

Undi TDP Politics : పీక్ స్టేజ్కి చేరిన టీడీపీ ఉండి పాలిటిక్స్ రచ్చ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement