Advertisement

సుజీత్ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడా?

Posted : December 21, 2020 at 6:31 pm IST by ManaTeluguMovies

షార్ట్ ఫిలిమ్స్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుజీత్. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ భారీ విజయంతో ఏకంగా రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి సినిమా ఆఫర్ వచ్చింది. దానికోసం రెండేళ్లకు పైగా వెయిట్ చేసి ఎట్టకేలకు సాహో తెరకెక్కించాడు.

అనూహ్యంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది. అయితే హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. రెండో ప్రయత్నం ఇక్కడ బోల్తా కొట్టడంతో సుజీత్ తర్వాతి సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. మెగాస్టార్ తో ఒక సినిమా రీమేక్ చేసే అవకాశం వచ్చింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం సుజీత్ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సుజీత్ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఒక టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ వీరిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేసిందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Advertisement

Recent Random Post:

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Posted : April 22, 2024 at 10:19 pm IST by ManaTeluguMovies

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement