రంగస్థలం స్ర్కిప్ట్ రామ్‌చరణ్‌కు ఎంతగానో నచ్చిందని, కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపాడు. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి వివరించడానికి చాలా భయపడ్డానని చెప్పారు. అదేంటంటే..’ప్రకాశ్ రాజ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అన్ని సపర్యలు చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మారచడం ఆఖరికి టాయిలెట్ బ్యాగ్ కూడా తీయాల్సి ఉంటుంది. ఈ లైన్ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ రామ్‌చరణ్ మాత్రం చేసేద్దాం అంటూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు.
ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టెన్షన్ పడుతూనే ఈ సీన్‌ను వివరించా. కానీ చరణ్ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణం అది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్ వందకు వంద శాతం తన పాత్రకు జస్టిస్ చేశారు’ అని సుకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఆచార్య మూవీతో పాటు, ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తుండగా, సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.