Advertisement

తన చీరల విషయంలో ఫన్నీ కామెంట్స్ చేసిన సుమ

Posted : February 8, 2021 at 7:53 pm IST by ManaTeluguMovies

తెలుగు టీవీ రంగంలో యాంకర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ. తన స్టయిల్లో దశాబ్దాలుగా టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగులో ఏ ఛానల్ అయినా ఏ షో అయినా మొదలుపెడితే దానికి సుమ పేరునే ముందు పరిగణిస్తారు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలన్నా సుమ ఉండాల్సిందే. తనకు బిజీగా ఉండి కుదరకపోతేనే వేరే వాళ్ళ దగ్గరకు వెళుతూ ఉంటుంది.

అలాంటి సుమ రోజూ నాలుగైదు షూటింగ్స్ తో యమా బిజీగా ఉంటుంది. షూటింగ్స్ కు తగ్గట్లుగా రోజూ కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉండాల్సి ఉంటుంది. అయితే ఇదంతా తన మేకప్ టీమ్ వల్లే సవ్యంగా చేయగలుగుతున్నానని చెబుతూ ఉంటుంది సుమ. వాళ్ళు పెర్ఫెక్ట్ గా అన్నీ ప్లాన్ చేసి ఉంచడం వల్లే రోజులో అన్ని షూటింగ్ లను పూర్తి చేయగలుగుతున్నానని అంది.

అలాగే అందరూ తాను ఎక్కువ చీరలు కడుతుండడం వల్ల తన దగ్గర చాలా చీరలు ఉంటాయి అనుకుంటారు కానీ అందులో అసలు నిజం లేదని అంటోంది. ప్రతీ పుట్టినరోజుకు తన తండ్రి చీరను కొంటాడట. అలాగే ఏడాది మొత్తంలో మహా అయితే రెండు, మూడు చీరలు మాత్రమే కొంటూ ఉంటానని, తనకు షాపింగ్ అంటే పెద్దగా ఇష్టం లేదని తెలిపింది సుమ.


Advertisement

Recent Random Post:

BAZOOKA The Chaser Official Teaser | Mammootty | Gautham Vasudev Menon | Deeno Dennis | Fanmade Work

Posted : March 26, 2024 at 1:44 pm IST by ManaTeluguMovies

BAZOOKA The Chaser Official Teaser | Mammootty | Gautham Vasudev Menon | Deeno Dennis | Fanmade Work

https://www.youtube.com/watch?v=PMyIpS3skfU

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement