అలాగే ఆవును పెంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్ పెట్టారు. ‘లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికొందని ఆశిస్తున్నాను.. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..’ అంటూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.