Advertisement

మన బుల్లి తెర స్టార్స్‌ పారితోషికాలు మీకు తెలుసా?

Posted : January 22, 2021 at 2:40 pm IST by ManaTeluguMovies

తెలుగు బుల్లి తెర అనగానే గుర్తుకు వచ్చేవి రెండు పేర్లు. ఒకటి సుమ మరియు జబర్దస్త్‌. సుమ యాంకరింగ్ లో తల పండి పోయారు. సుదీర్ఘ కాలంగా ఆమె చేస్తున్న యాంకరింగ్ కు జనాలు కట్టి బానిసలుగా మారిపోయారు. ఇక కామెడీ షో అంటే జబర్దస్త్‌ అన్నట్లుగా మారిపోయింది. సుమ యాంకర్‌ గా చేసే కార్యక్రమాలకు ఆడియో వేడుకలు చేస్తే ఎంత పారితోషికం తీసుకుంటుంది అనేది విషయం చాలా మందికి సస్పెన్స్‌. ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు మేము మీ ముందుకు వచ్చాం.

సుమ ఒక్కో ఆడియో వేడుక లేదా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌ కు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు తీసుకుంటుంది. వేడుక ను బట్టి సినిమా బడ్జెట్‌ ను బట్టి కూడా ఈమె పారితోషికం మారుతుంది. ఇక సుమ క్యాష్‌ తో పాటు ఇంకా పలు బుల్లి తెర గేమ్ షోలు చేస్తూ ఉంటుంది. వాటికి ఒక్కో ఎపిసోడ్‌ కు రెండు లక్షల రూపాయల వరకు పారితోషికంగా అందుకుంటుంది. ఇక ఆమె యూట్యూబ్‌ మరియు ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇక జబర్దస్త్‌ యాంకర్స్‌ విషయానికి వస్తే రష్మీకి నెలకు రూ.4 లక్షలు, అనసూయకు నెలకు రూ.5 లక్షలు వీరిద్దరు ఏవైనా ఈవెంట్‌ చేస్తే రెండు లక్షలు తీసుకుంటారు. ఇక కార్తీక దీపం లో దీపగా నటిస్తున్న ప్రేమికి కూడా భారీ పారితోషికం ఉంటుంది. ఆమెకు రోజుకు దాదాపుగా రూ.25 వేల రూపాయలను ఇస్తారు. ఇక శ్రీముఖి ఒక్క షో కు లక్ష వరకు తీసుకుంటుంది. శ్యామల మరియు మంజుష, ప్రశాంతి వంటి వారు రూ.50 వేల వరకు పారితోషికంగా అందుకుంటారు. ఇంకా సీరియల్‌ ఆర్టిస్టులు చాలా మంది కూడా 10 నుండి 25 వేల వరకు రోజు వారి పారితోషికంను అందుకుంటారు.


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special Latest Promo – #DCS – 27th March 2024 – Pranitha Subhash,Nandu,Hyper Aadi

Posted : March 25, 2024 at 1:32 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special Latest Promo – #DCS – 27th March 2024 – Pranitha Subhash,Nandu,Hyper Aadi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement