అమ్మోరు చిత్రంలో బాల నటిగా కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులతో టచ్ లోనే ఉంది. గత కొంత కాలంగా యూట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలతో బాగా పాపుర్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తో జీ తెలుగు సీరియల్స్ ప్రమోషన్ యాడ్స్ లో కూడా నటించింది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. దాంతో ఆమెను ఈ సీజన్ కు తీసుకోవాలని నిర్ణయించారు. ఆమె ఆసక్తిగా ఉందని అయితే ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సాదారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు వారాల ప్రకారం పారితోషికం ఉంటుంది. సునైన చాలా పెద్ద పారితోషికంనే కోట్ చేసిందట. అయితే ఆమె షో లో ఉంటే ఖచ్చితంగా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే అంత మొత్తంను ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పారట. ఆమె ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో చూడాలని కూడా ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఫాలో అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఉన్నారట. ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ విషయంలో ఒక్క కన్ఫర్మ్ కూడా రాలేదు. షో ప్రారంభం అయిన రోజే కంటెస్టెంట్స్ అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. మరి ఫైనల్ జాబితాలో సునైన ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.