ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చిరంజీవిని చూడగానే ఏడుపు, పవన్ కు 100 ముద్దులు: సురేఖా వాణి

నటి సురేఖా వాణికి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటారామె. అక్క, వదిన, అత్త పాత్రలకు సరిగ్గా సరిపోయే సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. బయట ట్రెండీగా కనిపించే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఇదిలా ఉంటే ఇటీవలే అలీతో సరదాగా షో కు విచ్చేసారు సురేఖ. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈమె. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని అలీ అడగ్గా ఒక్కోసారి గుళ్లో దేవుడిని చూడగానే మనకు తెలీకుండానే నీళ్లు వచ్చేస్తాయి. అలా చిరంజీవి గారిని చూడగానే నాకు తెలీకుండానే ఏడ్చేసా. వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని నన్ను హగ్ చేసుకున్నారు అని వివరించింది.

అలాగే 100 ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరు అన్న ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పేసింది ఈ క్యారెక్టర్ నటి.

Exit mobile version