ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సూర్య ఆ సాహసం చేస్తే అందరూ ఆయన దారిలో నడుస్తారా?

కరోనా కారణంగా ఇప్పట్లో సినిమా పరిశ్రమ కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్లు ఎలాగూ ఓపెన్ అవ్వవు కనుక కనీసం సినిమాలను ఓటిటి ద్వారా అయినా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఒక సారి ఓటిటి ద్వారా సినిమాలు విడుదల అయితే ఇకపై థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే అనుమానంను థియేటర్ల యాజమాన్యం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య నిర్మించిన పొన్ మగల్ ను డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే సినిమాను భారీ మొత్తం కు కొనుగోలు చేసేందుకు ఒక ఓటిటి ఒప్పందం కూడా చేసుకుంది. అయితే థియేటర్ యాజమాన్యం సూర్య నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఒకవేళ సూర్య సూర్య సినిమాను డిజిటల్ గా విడుదల చేస్తే ఆయనపై నిషేధం విధించాలని, ఇకపై ఆయన రాబోయే సినిమాలు కూడా థియేటర్ లలో విడుదల కానివ్వము అన్నారు.

థియేటర్ల యాజమాన్యం హెచ్చరికలు పట్టించుకోకుండా సూర్య డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాడు. తప్పని పరిస్థితుల్లో, అప్పులు ఉన్న కారణంగా సినిమాను విడుదల చేయాల్సి వస్తుంది అంటూ సూర్య చెప్పొకొచ్చాడు. సూర్య డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అయితే ఆయన దారిలో చాలా మంది నిర్మాతలు కూడా అడుగులు వేసే అవకాశం ఉంది. సూర్య కొత్తగా నిర్మాతలకు దారి చూపించబోతున్నాడు అంటున్నారు.

కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు సినిమాలు కూడా ఓటిటి విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది వరకు థియేటర్లు ఓపెన్ అయ్యేనా లేదో తెలియదు. అందుకే నిర్మాతల నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఓటిటి ద్వారా పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version