ఈరోజు సూర్య తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ఆకాశం నీ హద్దురా చిత్రం నుండి కాటుక కనులే సాంగ్ ను విడుదల చేసారు. సాంగ్, విజువల్స్ అన్నీ మంచి ఫీల్ ను తీసుకొస్తున్నాయని చెప్పాలి. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ప్రభావం కారణంగా కుదర్లేదు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.
మొదట ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ లో రిలీజ్ చేస్తారని అన్నారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాదికి ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.