దీంతో సుశాంత్ మృతిపై నెలకొన్న అనుమానాలకు దీంతో తెరపడినట్టైంది. సుశాంత్ ను గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టు కీలకంగా మారింది. ఈకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాంగ్మూలం మేరకు డ్రగ్స్ వ్యవహారంపై ఎన్సీబీ విచారణ జరుగుతోంది.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నెమ్మదించిందని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. సుశాంత్ మృతిపై దర్యాప్తును కాకుండా.. ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతోందని ఆరోపించారు. సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసిన ఎయిమ్స్ డాక్టర్ ఒకరు ఇది హత్యే అయి ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ కేసులో విషయం మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.