తాప్సి మాట్లాడుతూ.. మా ఇంట్లో ఒకే టీవీ ఉంటుంది. నాన్న హాలీవుడ్ యాక్షన్ మూవీస్ చూసేందుకు ఇష్టపడతారు. ఆయన సినిమా చూడటం మొదలు పెడితే మేము అంతా కూడా సైలెంట్ గా ఆ సినిమాను చూడటం లేదంటే మరేదైనా పని చేసుకోవడం చేయాల్సిందే. సినిమా చూస్తున్న సమయంలో ఏదైనా రొమాంటిక్ సన్నివేశం వస్తుంటే మాకు చెమటలు పట్టేవి. ఆయన ఏం అంటారో అంటూ ఆ సమయంలో కాస్త ఆందోళన కలిగేది. మెల్లగా మంచి నీళ్ల కోసం లేదా మరేదైనా పని కోసం లేచేవాళ్లం లేదంటే ఛానల్ అయినా మార్చేవాళ్లం అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.