Advertisement

వరుణ్ తేజ్ తో ఆడిపాడనున్న తమన్నా

Posted : July 25, 2021 at 6:49 pm IST by ManaTeluguMovies

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభమైంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు స్కోప్ ఉందిట. తాజా సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సాంగ్ లో నర్తించనుందని తెలుస్తోంది.

ఈ పెప్పి డ్యాన్స్ బీట్ నెంబర్ లో తమన్నా గ్లామరస్ గా కనిపించనుందిట. రెమ్యునరేషన్ కూడా బాగానే డిమాండ్ చేసిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. గని ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

Arvind Kejriwal: జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు…..!!

Posted : March 24, 2024 at 7:14 pm IST by ManaTeluguMovies

Arvind Kejriwal: జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు…..!!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement