ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కెరీర్ బెస్ట్ ప్యాకేజీ ఆనందంలో మిల్కీ

వెటరన్ స్టార్స్ సరసన నటించేందుకు ఇటీవల కథానాయికలు సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదని కథనాలొస్తున్నాయి. తమకంటే మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న స్టార్ల సరసన నటించడానికి ఇష్టపడడం లేదు. అయినా కానీ ఇప్పుడున్న స్టార్లలో మెగాస్టార్ కి కథానాయిక కొరత అంతగా కనిపించడం లేదు. తమన్నా- నయనతార లాంటి నాయికలు చిరు సరసన నటించేందుకు ఆసక్తిగానే ఉన్నారని అర్థమవుతోంది.

మెగాస్టార్ కోరాలే కానీ తాను నటించేందుకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని తమన్నా లాంటి బ్యూటీ వినమ్రతను చాటుకున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో తనకు ఎంతో ముఖ్యమైన పాత్రలో అవకాశం కల్పించినందుకు తమన్నా అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఏకంగా భోళా శంకర్ లో సోలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరుకి సోదరి పాత్రలో నటిస్తోంది. ఇక తమన్నాతో చిరు రొమాన్స్ ఆద్యంతం రక్తి కట్టించనుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ నెలలో పూజా కార్యక్రమాల తర్వాత వెంటనే చిత్రీకరణను ప్రారంభించనున్నారు. తమన్నా భాటియా నాయికగా ఫిక్సయినట్టేనని తెలుస్తోంది. మిల్కీ బ్యూటీకి భారీ పారితోషికం ముట్టజెబుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఇక మిల్కీ తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకుంటున్నాననే ఆనందంలో ఉన్నారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర- కెఎస్ రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుల్లితెరపై తమన్నా చేయాల్సిన ఓ పాపులర్ షో విషయంలో నిర్మాతలతో విభేధాలు తలెత్తి వైదొలగిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ పెద్ద తెర అవకాశాలను మాత్రం తమన్నా తెలివిగా ఒడిసిపడుతోంది.

Exit mobile version