ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తమన్నాతో వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ అంటున్నారు.. ఏ సినిమాలో అంటే.

హిట్, ఫ్లాపులకు అతీతంగా కెరీర్ కొనసాగిస్తున్న దర్శకుడు సంపత్ నంది. మంచి కథకుడు, రచయిత కూడా అయిన సంపత్ నంది ప్రస్తుతం మూడు సినిమాలకు కథలు అందించాడు. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. రచ్చ వంటి హిట్ చిత్రం చేసాడు సంపత్.

బెంగాల్ టైగర్, గౌతమ్ నందా సినిమాల తర్వాత ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా, తెలంగాణ కబడ్డీ కోచ్ గా ప్రధాన పాత్ర పోషిస్తోంది తమన్నా. ఆంధ్ర కబడ్డీ కోచ్ గా గోపీచంద్ నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కు కీలక పాత్ర దక్కినట్టు సమాచారం.

కబడ్డీ కోచ్ గా నటిస్తున్న తమన్నాకు వెన్నెల కిశోర్ అసిస్టెంట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం మంచి కామెడీ ట్రాక్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కథలో భాగంగా సినిమాలో ఫన్ కూడా ఉండేలా వెన్నెల కిశోర్ పాత్ర డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. తమన్నా – వెన్నెల కిశోర్ మధ్య సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయని అంటున్నారు.

ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా త్వరలో షూటింగ్ కు వెళ్లనుంది. సినిమాలో మరో హీరోయిన్ గా దిగంగ‌న సూర్యవంశీ న‌టిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version