ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జిమ్ లో హాట్ ఫొటోతో తమన్నా హల్చల్

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా కానీ తమన్నా ఇంకా తన ప్రత్యేకతను కాపాడుకుంటోంది. ఇప్పటికీ తమన్నా టాలీవుడ్ లో బిజీ నటి. తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తుంటుంది.

రీసెంట్ గా తమన్నా పోస్ట్ చేసిన జిమ్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఇందులో తమన్నా గ్లామర్ బాగా హైలైట్ అవుతుండడం ప్రధాన కారణం. తమన్నా రెడ్ కలర్ జిమ్ టాప్, టైట్ బ్లాక్ ప్యాంట్ లో తమన్నా చెమటలు చిందించిన ఫోటోను షేర్ చేసింది. దీనికి “మన బ్రెయిన్ ఏది నమ్ముతుందో దాన్ని మన శరీరం సాధిస్తుంది” అని కొటేషన్ ను పోస్ట్ చేసింది.

తమన్నా స్లిమ్ ఫిగర్ కుర్రకారుకి మంచి ట్రీట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సీటిమార్, ఎఫ్3లో నటిస్తోన్న తమన్నా, అంధధూన్ రీమేక్ లో బోల్డ్ రోల్ చేయాల్సి ఉంది.

Exit mobile version