తాజాగా తరుణ్ భాస్కర్ మలయాళ మూవీ ‘కప్పెల’ చూసి దాని మీద ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయం చెబుతూ.. మన కమర్షియల్ సినిమాల మీద కౌంటర్లు వేశాడు. ‘‘హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో రీఎంట్ర ీఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో’’.. ఇదీ తరుణ్ పోస్ట్ చేసిన మెసేజ్. ఇందులో టాలీవుడ్ కమర్షియల్ సినిమాలు చాలా వాటి మీదే కౌంటర్లున్నాయి. ఐతే చివరి పది నిమిషాల్లో రైతులు, సైనికులు, దేశం గురించి మెసేజ్ ఉండదు అనే కామెంట్ దగ్గర అందరూ మహేష్ సినిమాలు ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’లతో కనెక్ట్ అయ్యారు. తమ హీరో సినిమాల మీద కౌంటర్లు వేసినందుకు మహేష్ ఫ్యాన్స్ తరుణ్‌ను టార్గెట్ చేసుకుని బూతులు తిట్టేశారు. దీనికి తరుణ్ దీటుగానే స్పందించాడు. ఐడెంటిటీ లేకుండా ఫేక్ ఐడీలతో తనను ట్రోల్ చేసేవాళ్లను తాను పట్టించుకోనంటూ వాళ్లను తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తూ సోషల్ మీడియా పోస్టుతో కౌంటర్ చేశాడు.