అయితే ఎన్టీఆర్ నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యమవుతుండడంతో ఇటు త్రివిక్రమ్ సినిమా కూడా వెనక్కి జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే వచ్చే సమ్మర్ వరకూ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు.
అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోగా మరో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక సినిమాను ప్లాన్ చేసాడు. పూర్తి వినోదాత్మకంగా రామ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ ను డిజైన్ చేసాడు. రామ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడం పట్ల ఆసక్తిగానే ఉన్నాడు.
వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పూర్తి చేసి సమ్మర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయాలన్నది ప్లాన్. మరి చూడాలి త్రివిక్రమ్ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో.