తర్వాత గోవా బ్యూటీ ఇలియానా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా రెండింటితోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా పూజాకు మరోసారి త్రివిక్రమ్ సినిమాలో మెరిసే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా పూజా ఇప్పటికే త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు), అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది.