ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

త్రివిక్రమ్ కు ఇదొక్కటే దారి

కరోనా/లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. దర్శకులంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. అయితే ఖాళీగా ఉండడం సమస్య కాదు. తమ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలిస్తే ఎన్నాళ్లయినా ఖాళీగా ఉండొచ్చు. సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చిపడింది.

మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి దర్శకులకు ఈ బాధ మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే “అల వైకుంఠపురములో” లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ కు చేతులు కట్టేసినట్టయింది మరి.

ఎన్టీఆర్ అందుబాటులో లేడు

నిజానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు లాక్ డౌన్ తో సంబంధం లేదు. ఈ సినిమాకు అడ్డంగా ఉన్నది లాక్ డౌన్ కాదు, ఆర్ఆర్ఆర్ సినిమా. అది కంప్లీట్ అయితే తప్ప ఎన్టీఆర్ ఫ్రీ అవ్వడు. ఎన్టీఆర్ బయటకొస్తే తప్ప త్రివిక్రమ్ షూటింగ్ స్టార్ట్ చేయలేడు. అలా ఎన్టీఆర్ తో సినిమాకు డెడ్ లాక్ పడింది.

వెంకీతో సినిమాకు మనసొప్పడం లేదు

చూస్తుంటే కనీసం 6-7 నెలల పాటు ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చేలా లేడు. కావాలనుకుంటే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేయొచ్చు. అంతెందుకు.. ఆల్రెడీ ప్రకటించిన వెంకీ సినిమా రెడీగా ఉంది. కానీ త్రివిక్రమ్ కు మాత్రం మనసొప్పడం లేదు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేస్తే ఆ రేంజ్ వేరు. అదే వెంకీతో సినిమా అంటే..! ఇక మాటల్లేవ్!

పక్కచూపులు చూడలేడు

పోనీ వెంకటేష్ తో సినిమా చేయడం ఇష్టంలేకపోతే అందరు దర్శకుల్లా త్రివిక్రమ్ కూడా ఓటీటీ వైపు ఓ చూపు చూడొచ్చు. త్రివిక్రమ్ వస్తానంటే ఎర్రతివాచీ పరచడానికి ఓటీటీలు సిద్దంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా అదే సమస్య. “అల వైకుంఠపురం లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత వెబ్ సిరీస్ చేయడం ఏంటి ఛీప్ గా” అనే కామెంట్ తప్పనిసరిగా ఉంది. దీనికంటే పైన చెప్పుకున్న వెంకీ ఆప్షన్ చాలా రెట్లు బెటర్.

చేతిలో ఉన్న ఆప్షన్ ఇదొక్కటే

ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ చేతిలో ఉన్న ఆప్షన్ ఒకే ఒక్కటి. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత తను ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలి. అలా అని ఈ 6-7 నెలలు ఖాళీగా ఉండకూడదు. సరిగ్గా ఇక్కడే మరోసారి తన పెన్నుకు పని చెప్పబోతున్నాడు త్రివిక్రమ్. ఈ గ్యాప్ లో పవన్ కల్యాణ్ కు చెందిన ఓ సినిమాకు రచనా సహకారం అందించాలనుకుంటున్నాడు. అది ఏ సినిమా అనేది త్వరలోనే బయటకొస్తుంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ కు ఇదొక్కటే దారి.

Exit mobile version