Advertisement

వారానికో ప్రమోషన్ అంటోన్న టక్ జగదీష్

Posted : March 23, 2021 at 10:13 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో టక్ జగదీష్ టీమ్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలకు ప్రమోషన్స్ అత్యంత కీలకమైన అంశంగా మారింది. అందుకే టక్ జగదీష్ టీమ్ వారానికో ప్రమోషనల్ యాక్టివిటీను డిజైన్ చేసింది.

ముందుగా ఈ నెల 27న రాజమండ్రిలో పరిచయ వేడుకను నిర్వహించనున్నారు. ఇలానే మరో మూడు ఈవెంట్స్ ను నిర్వహిస్తారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వచించిన విషయం తెల్సిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. అలాగే జగపతి బాబు ఈ సినిమాలో నానికు అన్నయ్యగా కీలక పాత్రను పోషించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Gam Gam Ganesha Movie New TEASER | Anand Devarakonda | Pragati Srivastava

Posted : April 16, 2024 at 5:58 pm IST by ManaTeluguMovies

Gam Gam Ganesha Movie New TEASER | Anand Devarakonda | Pragati Srivastava

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement