Advertisement

టక్ జగదీష్ ను ఎవరూ ఆపలేరంటున్న దర్శకుడు

Posted : October 22, 2020 at 7:05 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా షూటింగ్ ఈ నెల మొదటి వారలో తిరిగి మొదలైన విషయం తెల్సిందే. అయితే షూటింగ్ జరిగి 10 రోజులైనా గడవక ముందే అర్ధాంతరంగా నిలిచిపోయిందన్న వార్తలు వచ్చాయి. టక్ జగదీష్ యూనిట్ లో ఒక సభ్యుడికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిచిపోయిందని, టీమ్ మొత్తం ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

టీమ్ నుండి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో అందరూ నిజమేనని అనుకున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, ఈ రూమర్స్ ను తనదైన స్టైల్ లో ఖండించాడు. టక్ జగదీష్ ను ఆపలేరు అంటూ శివ నిర్వాణ పోస్ట్ పెట్టారు. 38వ రోజు సెట్స్ లో ఉన్నామంటూ దర్శకుడు తెలియజేసాడు.

బ్రదర్స్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నానికు అన్నయ్య పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని భావిస్తున్నారు. టక్ జగదీష్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.


Advertisement

Recent Random Post:

పవన్ కల్యాణ్ కాదు..అల్లు అర్జున్ ఒక బ్రాండ్ : Pothina Mahesh | Pawan Kalyan | Allu Arjun

Posted : April 20, 2024 at 7:44 pm IST by ManaTeluguMovies

పవన్ కల్యాణ్ కాదు..అల్లు అర్జున్ ఒక బ్రాండ్ : Pothina Mahesh | Pawan Kalyan | Allu Arjun\

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement