ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

MEGA బొనాంజ.. #చిరు 153 స్పెషల్ రివీల్..!

ఆగస్టు 22 స్పెషల్ డేని సెలబ్రేట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాలు ఏర్పాట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి మునుపెన్నడూ లేనంతగా సామాజిక కార్యక్రమాలకు చిరు అభిమానులు ప్లాన్ చేశారు. అన్నదాన రక్తదాన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తోంది.

అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు వరుస కానుకలు ఇవ్వనున్నారు. ఆచార్యకు చెందిన గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు కొరటాల బృందం ప్లాన్ లో ఉందని తెలుస్తోంది. అలాగే 21 ఆగస్టు సాయంత్రం 5.04 గంటలకు “చిరు 153కి సంబంధించిన సుప్రీం రివీల్ ఆఫ్ మెగాస్టార్!“ అంటూ ముందస్తు ప్రకటనను కొణిదెల టీమ్ విడుదల చేయగా మెగాభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి.

బాస్ చిరంజీవి గత కొంతకాలంగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. చిరు 153 లో మెగాస్టార్ లుక్ ని రివీల్ చేస్తారా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు. “మెగా బొనాంజ కోసం వేచి ఉండండి.. బర్త్ డే వేడుకల్ని మెగా స్టైల్లో సెలబ్రేట్ చేద్దాం.“ అంటూ తాజాగా కొణిదెల సంస్థ ప్రకటనను విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ – రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనున్నారు. మెగాస్టార్ ఈ సినిమాతో పాటు బాబి .. మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ వేర్వేరు సినిమాల్లో నటించాల్సి ఉంది. చిరు బర్త్ డే సందర్భంగా వీరంతా స్పెషల్ కానుకల్ని సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

Exit mobile version