Advertisement

ఓటీటీలో మెగా ‘ఉప్పెన’ డేట్‌ ఖరారు

Posted : April 1, 2021 at 2:53 pm IST by ManaTeluguMovies

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతు వచ్చిన ఉప్పెన సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. సినిమా బాగుంటుందేమో అని అంతా అనుకున్నారు. కాని ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. లాక్ డౌన్‌ తర్వాత బిగ్గెస్ట్‌ చిత్రంగా ఇప్పటి వరకు ఉప్పెన నిలిచింది. ఈ ఏడాది టాప్‌ చిత్రాల జాబితాలో కూడా ఉప్పెన ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి ఉప్పెన సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ వచ్చేసింది.

ఉప్పెన సినిమా ను గతంలోనే నెట్‌ ఫ్లిక్స్ వారికి అమ్మేయడం జరిగింది. వారు నిర్మాతలతో ఒప్పందం ప్రకారం సినిమా విడుదల అయిన 50 రోజులకు స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యారు. ఉప్పెన సినిమా ను ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉప్పెన సినిమా క్రేజ్‌ బజ్‌ అలాగే ఉంది. కనుక సినిమా తప్పకుండా ఓటీటీలో కూడా భారీ వ్యూస్‌ ను రాబట్టడం ఖాయం అంటున్నారు.


Advertisement

Recent Random Post:

CM Jagan key comments on AP Capital | ఏపీ రాజధానిగా విశాఖ

Posted : January 31, 2023 at 2:07 pm IST by ManaTeluguMovies

Watch CM Jagan key comments on AP Capital | ఏపీ రాజధానిగా విశాఖ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement