Advertisement

యూ/ఏ అందుకున్న వకీల్ సాబ్

Posted : April 5, 2021 at 9:49 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత కనిపించబోతున్న సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సర్వం సిద్ధమైంది. నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మించాడు. ఒరిజినల్ తో పోలిస్తే వకీల్ సాబ్ లో మార్పులు చేర్పులు బాగానే జరిగాయి.

పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే వకీల్ సాబ్ పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ/ఏ తో సెన్సార్ క్లియరెన్స్ అయింది. ఇక భారీ ఎత్తున వకీల్ సాబ్ కలెక్షన్స్ ను పిండుకోవడమే మిగిలింది.


Advertisement

Recent Random Post:

Padutha Theeyaga Latest Promo | Series 23 | Semi Finals | 22nd April 2024 | SP.Charan, Sunitha

Posted : April 16, 2024 at 1:36 pm IST by ManaTeluguMovies

Padutha Theeyaga Latest Promo | Series 23 | Semi Finals | 22nd April 2024 | SP.Charan, Sunitha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement